భారత దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అదే ఇంగ్లిష్ మీడియం వాళ్ళు మాత్రం, "India is my country, all Indians are my brothers and sisters" అని ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. అసలు మన దేశాన్ని ఇండియా అని ఎందుకు పిలవాలి? భారత్ అని ఎందుకు పిలవకూడదు? సింధు నది ప్రవహించడం వల్ల అనుకుందాము అంటే అసలు ఆ నది ఇప్పుడు మన దెశం లొ నే లేదు. అదీ కాక, అసలు ఆ పేరు పెట్టింది ఇంగ్లిష్ వాళ్ళు, దాన్నే మనం పొడిగించవలసిన అవసరం లేదు. బొంబాయి, ముంబై అయినప్పుడు, మద్రాస్, చెన్నై అయినప్పుడు, కలకత్తా, కోల్ కత అయినప్పుడు, ఇండియా భారత్ ఎందుకు కాకూడదు?
ఒక్కసారి అలోచించండి....ఇది మీకు సబబుగా అనిపించడం లేదా? your comments are always welcome....
Thanks and Regards,
Bharat M.
Sunday, June 1, 2008
Subscribe to:
Comments (Atom)